video of the day

my slide show

Wednesday, September 14, 2011

పాలనలో మోడీ కింగ్, అమెరికా కాంగ్రెసు నివేదిక




Narednra Modi
వాషింగ్టన్: ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో సమర్థపాలనను, ప్రతిభావంతమైన అభివృద్ధిని అందిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుందని అమెరికా కాంగ్రెసు పరిశోధనా సర్వీసు నివేదిక తెలియజేస్తోంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోన గుజరాత్ జాతీయ ఆర్థిక పెరుగుదలకు ఎంతో అందిస్తోందని చెప్పింది. గుజరాత్ దారిలోనే బీహార్ నడుస్తోందని చెప్పింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కూడా నివేదిక ప్రశంసలతో ముంచెత్తింది.
  Read:  In English 
మోడీ ఆర్థిక ప్రక్రియను సరైన దారిలో పెట్టారని, రెడ్ టేపిజాన్ని, అవినీతిని అరికట్టారని, దానివల్ల జాతీయ ఆర్థిక పెరుగుదలకు గుజరాత్ దోపదపడిందని నివేదిక అభిప్రాయపడింది. 94 పేజీల ఆ నివేదికను అమెరికా ప్రజాప్రతినిధుల కోసం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేశారు. 2002 అల్లర్ల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే రాష్ట్రంలో ఆధునిక రోడ్ల నిర్మాణంలో, విద్యుచ్ఛక్తి మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ ముందంజవేశారని, ఇటీవలి సంవత్సరాల్లో గుజరాత్ 11 శాతం వార్షథిక పెరుగుదల రేటు సాధించిందని నివేదిక చెప్పింది. జనరల్ మోటార్స్, మిత్సుబిషి వంటి కీలకమైన సంస్థలు కూడా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పింది. భారతదేశంలోని మొత్తం జనాభాలో 5 శాతం మాత్రమే జనాభా ఉన్న గుజరాత్ భారత ఎగుమతుల్లో ఐదింట ఒక్క శాతాన్ని సాధించిందని చెప్పింది.

బీహార్‌లో కుల ప్రాతిపదిక రాజకీయాలను పక్కకు నెడుతూ సుపరిపాలనను అందిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారని నివేదిక ప్రశంసించింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో నితీష్ విజయం సాధించారని చెప్పింది. పౌరులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా మౌలిక సదుపాయాలను, విద్యును అభివృద్ధి చేస్తున్నారని చెప్పింది. మోడీ, నితీష్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి స్ఫూర్తినిచ్చాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సమస్యను కూడా నివేదిక ప్రస్తావించింది.

No comments:

Post a Comment